సెంచరీతో చెలరేగిన అకెర్‌మాన్

17-11-2026 | 05:05am

బంగ్లాదేశ్, సౌతాఫ్రికా టెస్ట్

జోహెనస్‌బర్గ్, నవంబర్ 16: బంగ్లాదేశ్‌తో(Bangladesh) జరుగుతున్న తొలి టెస్టులో(First Test) సౌతాఫ్రికా ఓపెనర్ మార్కూస్ అకెర్‌మాన్(Markus Ackermann) సెంచరీతో చెలరేగాడు. మార్కరమ్ రూపంలో తొలి వికె ట్ త్వరగా కోల్పోయినప్పటికీ  బంగ్లా బౌలర్లను ఉతికారేస్తూ తన కెరీర్లో తొలి టెస్టు సెం చరీని సాధించాడు. 125 బంతుల్లో శతకం అందుకున్న అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. అలాగే జుబైర్ హంజా (129 బం తుల్లో 83 పరుగులు) అర్థసెంచరీ చేసాడు.

వీరిద్దరూ రెండో వికెట్‌కు  202 పరుగులు జోడించారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 4 వికెట్లకు 287 పరు గులు చేసింది. అంతకముందు బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ హృదోయ్ (137), లిటన్‌దాస్(120) సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు, డేన్ పీటర్సన్ 4, మార్కో జాన్సెన్ ఒక వికెట్ తీశాడు.

మరిన్ని వార్తలు