1 నుంచి ఖేలో ఇండియా టార్చ్ ర్యాలీ
హైదరాబాద్, నవంబర్ 29: డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను(Khelo India Youth Games) దేశానికే ఆదర్శంగా నిలిచేలా నిర్వహించాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలు పునిచ్చారు. ఖేలో ఇండియా క్రీడల నిర్వహ ణ, మౌలిక సదుపాయాలు, ప్రచార కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్, నోడల్ ఆఫీసర్ల సమావేశంలో మంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా క్రీడల స్ఫూర్తిని చా టేలా ఖేలో ఇండియా టార్చ్ ర్యాలీని భారీస్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నట్టు తెలిపారు.
డిసెంబర్ 1 నుంచి 8వరకూ ఈ ర్యాలీ సాగనుంది.ఖేలో ఇండియా టార్చ్ ర్యాలీని రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖేలో ఇం డియా క్రీడల నిర్వహణకు అత్యంత ప్రాధా న్యం ఇస్తున్నారని మంత్రి తెలిపారు. క్రీడల నిర్వహణకు జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛ కల్పించడంతో పాటు అవసరమైన నిధులను అందిస్తున్నామని, అదనపు నిధులు అ వసరమైతే సమకూరుస్తామని వెల్లడించారు. క్రీడా వేదికల అభివృద్ధి, క్రీడా సామగ్రి, క్రీడాకారులకు వసతి, భోజనం, రవాణా తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఆదేశించారు.
ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న క్రీడా మౌలిక సదుపాయాలు భవిష్యత్ తరాలకు అందించే విలువైన ఆస్తులని పేర్కొన్నారు. ప్రతి వేదికలో పండుగ వాతావరణం నెలకొనాలని మంత్రి సూచించారు. పాఠశాలలు, గురుకు లాలు, కళాశాల లకు చెం దిన 8 నుంచి 12వ తరగతి విద్యార్థులను క్రీడా పోటీలను వీక్షించేందుకు తీసుకురావాలని, ఇందుకు అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ర్యాలీలో భాగస్వామ్యం చేయాలన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.