టీమిండియా ఆలౌట్.. కివీస్‌కు ఈజీ టార్గెట్

15-11-2026 | 10:53am

మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్‌తో(NZ vs IND 5th ODI) జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ మరోసారి నిరాశపరిచింది. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన ఈ సిరీస్ చివరి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు కివీస్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. దీంతో భారత్ 209 పరుగులకే All Out అయింది. ప్రత్యర్థి ముందు 210 పరుగుల Targetను ఉంచింది. మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ 7 పరుగులకే, విరాట్ కోహ్లీ 5 పరుగులకే పెవిలియన్ చేరారు. కీలక ఆటగాళ్లు తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో భారత జట్టుపై Pressure పెరిగింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో వికెట్ల పతనం కొనసాగింది.

ఈ క్రమంలో అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ మాత్రమే కొంతసేపు పోరాటం చేశారు. ఇద్దరూ చెరో 46 పరుగులు సాధించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి Support లభించకపోవడంతో భారత్ 209 పరుగులకే ఇన్నింగ్స్ ముగించింది. ఇప్పటికే సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా Washout అయింది. ఇప్పుడు 210 పరుగుల Targetను కాపాడుకుని సిరీస్‌ను సొంతం చేసుకుంటుందా? లేక న్యూజిలాండ్ విజయంతో Seriesను సమం చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు