జపాన్ గడ్డపై భారత షట్లర్ చరిత్ర

15-11-2026 | 10:09am

జపాన్ గడ్డపై భారత షట్లర్ లక్ష్యసేన్ సత్తా చాటాడు. కుమామోటో మాస్టర్స్ జపాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో అద్భుతమైన Comebackతో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. జపాన్ ఆటగాడు కోకి వతనాబేపై 13-21, 21-18, 21-14 తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు.

ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌కు ఆరంభం కలిసిరాలేదు. తొలి గేమ్‌ను 13-21తో కోల్పోయినప్పటికీ.. ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా తర్వాతి రెండు గేమ్‌లలో అదరగొట్టాడు. రెండో గేమ్‌లో 21-18తో పైచేయి సాధించి మ్యాచ్‌ను సమం చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మరింత దూకుడుగా ఆడి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు.

మూడో గేమ్‌లో 11-7తో కీలక ఆధిక్యం సాధించిన లక్ష్యసేన్.. ఆ తర్వాత తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ప్రత్యర్థి Comeback చేసే అవకాశం లేకుండా వరుస పాయింట్లు సాధిస్తూ 21-14తో గేమ్‌ను ముగించాడు. గంటా 4 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో విజయం సాధించి Kumamoto Masters Japan Open Titleను కైవసం చేసుకున్నాడు. ప్రపంచ 13వ ర్యాంకర్‌గా బరిలోకి దిగిన లక్ష్యసేన్ ఈ విజయంతో భారత బ్యాడ్మింటన్ అభిమానుల్లో ఆనందం నింపాడు.

మరిన్ని వార్తలు