ఇది ఫాసిస్టు పాలన

15-11-2026 | 05:25am

దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు

  1. వ్యవస్థలను ధ్వంసం చేశారు
  2. 2014 ముందు, ఆ తర్వాత అన్నట్లుగా ఎన్నికల వ్యవస్థ
  3. 2024 ఎలక్షన్స్‌లోనూ భారీ అక్రమాలతో గెలిచారు 
  4. మహారాష్ట్రలో పవర్ కోసం 70 లక్షల ఓట్లను చేర్చారు
  5. అన్నింటికీ పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి
  6. సంపన్నుల జాబితాలో పన్నెండేండ్ల కింద 600 స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు రెండో స్థానంలోకి
  7. ఫాసిస్టుల రన్నింగ్, రాంపింగ్, షౌటింగ్, స్క్రీమింగ్ పెరిగిపోయాయి
  8. వారు ఆడిందే ఆట.. పాడిందే పాట..
  9. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసమే మా పోరాటం
  10. ప్రజలంతా కలిసి రావాలి.. భారత్ సమ్మిట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): దేశంలో ఫాసిస్ట్ పాలన కొనసాగుతున్నదని, ప్రజాస్వామ్యం మచ్చుకైనా లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.  2014 లోక్‌సభ ఎన్నికల్లోనే ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేశారని, 2024 ఎలక్షన్స్‌లోనూ భారీగా అక్రమాలతోనే అధికారంలోకి వచ్చారని ఆయన దుయ్యబట్టారు. ‘పది పన్నెండేండ్ల నుంచి దేశంలో, రాజకీయాల్లో ఫాసిస్టుల గొంతు గట్టిగా వినిపిస్తున్నది.

వారి సంఖ్య పెరిగిపోయింది. అన్ని రంగాల్లో వారు దూరిపోయారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ప్రశ్నించేవారిని, ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. వాళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతున్నది’ అని మండిపడ్డారు.

సంపన్నుల జాబితాలో 12 ఏండ్ల కింద 600 స్థానంలో ఉన్న అదానీ.. ఇప్పుడు రెండో స్థానంలోకి చేరారని, దీనికి కారణం అన్ని రంగాలను ఆయనకు మోదీ సర్కార్ ధారాదత్తం చేయడమేనని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పున రుద్ధరించేందుకు కలిసికట్టుగా ఉద్యమించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. 

2024 ఎన్నికల్లోనూ అక్రమాలు..

‘2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తీరును అంతకుముందు ఎన్నడూ ఈ దేశం చూసి ఉండదు. వందల కోట్ల రూపాయలు రాజకీయాల్లోకి వచ్చి చేరాయి. గతం లో పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల పోరు జరిగేది. సంకీర్ణ ప్రభుత్వాలకు అలవాటుపడిన వ్యవస్థను 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కసారిగా మార్చేశారు.  రాజకీయ వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టించేశారు. ఆ ఎన్నికలతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారు.

ఇప్పు డు ప్రజాస్వామ్యం మృగ్యమైపోయింది’ అని రాహుల్ దుయ్యబట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ అక్రమాలతోనే బీజేపీ అధికారంలోకి వచ్చినట్లు తమ దగ్గర బలమైనా ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ‘మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ కూటమి ఎక్కువ సీట్లు గెలిచింది.

ఆ తర్వాత 3 నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. దీనికి కారణం..  అసెంబ్లీ ఎన్నికల్లో అదనంగా 70 లక్షలకు పైగా ఓట్లు నమోదు చేశారు. ఆ ఓట్లతోనే అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. వ్యవస్థలు నాశనం అవుతు న్నా మనం ప్రజాస్వామ్యం అని గొప్పగా చెప్పుకొంటున్నాం. రాజకీయాలంటే గట్టిగా మాట్లాడటం, ఘాటైన విమర్శలు చేయడం కాదు. ప్రేమతో గెలవాలి’ అని రాహుల్ అన్నారు. 

అవి ఎన్నికలు ఎలా అవుతాయి?

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఏకంగా 14 కోట్ల మందిని ఓటర్లు కాదని ఎన్నికల సంఘం  పేర్కొందని రాహుల్ గాంధీ విమర్శించారు. అంత పెద్ద మొత్తంలో ఓట్లు తొలగించి ఎన్నికలు జరిపితే, వాటిని అసలు ఎన్నికలు అని ఎలా అంటారని ఆ యన ప్రశ్నించారు. ‘రాజ్యాంగబద్ధమైన అన్ని వ్యవస్థలు వారి చేతుల్లో బందీ అయ్యా యి.  ప్రతిపక్షంగా మేం ఏదైనా చేద్దామన్నా వ్యవస్థల నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదు.

వ్యవస్థలు సహకరించకపో యినా మేం నిరాశ చెందకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లగలిగాం. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిన భారత్ జోడో పాదయాత్ర ద్వారా కోట్లాది మంది ప్రజలను నేరుగా కలుసుకున్నాం. ఆ ప్రయాణంలో మమ్మల్ని మేం మరింతగా తెలుసుకోగలిగాం’ అని తెలిపారు. 

పన్నెండేండ్లుగా రన్నింగ్, షౌటింగ్..

సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉం టారని రాహుల్ గాంధీ అన్నారు. ‘మొదటి రకం వ్యక్తులు.. అన్నీ తమకే తెలుసనుకుంటారు. ఏ ప్రశ్నకైనా సమాధానం తామే చెప్పగలమనుకుంటారు. వాళ్ల మాటను ఎవరైనా వినకపోతే అరిచి లొల్లి చేస్తారు. వేరేవాళ్ల మాటను అసలు వినరు. తమ ఆటలే సాగాలనుకుంటున్నారు. అలాంటి వారిని ఫాసిస్టులు అంటారు. పది పన్నెడేండ్ల నుంచి ఈ దేశంలో ఆ రకం వారికి సంఖ్య భారీగా పెరిగిపోతున్నది.

రాజకీయాలు, వ్యాపారం, విద్య.. ఇలా అన్ని రంగాలను వారే శాసిస్తున్నారు. ప్రజా చర్చల్లోనే వారే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పన్నెండేండ్ల నుంచి ఫాసిస్టుల రన్నింగ్, రాంపింగ్, జంపింగ్, షౌటింగ్, స్క్రీమింగ్ పెరిగిపోయింది. దానితో ప్రజ లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక, రెండో రకం వ్యక్తులు.. ఇతరుల అభిప్రాయాలను వింటారు. తమ ఆలోచనలను పంచుకుంటారు. తప్పులను అంగీకరిస్తారు’ అని ఆయ న తెలిపారు.

వ్యవస్థలు కుప్పకూలినప్పుడే ఫాసిస్టులు తెరపైకి వస్తారని, దేశంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోవడంతో ఫాసిస్టులే రాజ్యమేలుతున్నారని దుయ్యబట్టారు. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే ఫాసిస్టులకు తావు ఉండదని, వారు కనుమరుగవుతారని పేర్కొన్నారు. వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం, ఫాసిస్టులను కనుమరుగు చేయాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని రాహుల్ తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేం దుకు తాము పోరాటం చేస్తున్నామని, కలిసి రావాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చా రు. రాజకీయాల్లో హింస, ద్వేషం, కోపం ఎన్నటికీ పనిచేయవని..  కేవలం ప్రేమ, అభిమానం, అహింస, సత్యం మాత్రమే ఏనాటికై నా విజయాన్ని సాధిస్తాయని తెలిపారు. సత్యం, అహింసా మార్గంలోనే తమ పోరా టం కొనసాగుతుందని రాహుల్  చెప్పారు. 

విదేశీ ప్రతినిధులు రాకుండా కేంద్రం కుట్ర 

భారత్ సమ్మిట్‌కు ఇతర దేశాల నుంచి ఎందరో మేధావులు రావాల్సి ఉండగా.. కేంద్రం కుట్ర పన్ని వారిని అడ్డుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘సమ్మిట్‌కు హాజరు కావా ల్సిన ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో వారు రాలేకపోయా రు.

అలాంటి వారందరికీ నేనే క్షమాపణ చెప్తున్నా. దేశంలో ఎలాంటి పరి స్థితులు ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు’ అని ఆయన అన్నారు. సమ్మిట్‌కు పలువురు విదేశీ ప్రతినిధులు రావాల్సి ఉండగా, వారి వీసా ను కేంద్రం నిరాకరించినట్లు వివాదం కొనసాగడంపై రాహుల్ పైవిధంగా స్పం దించారు. హైదరాబాద్, బెంగళూరులో ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందిందని ఆయన అభినందించారు.  

600 స్థానం నుంచి రెండోస్థానానికి అదానీ 

సంపన్నుల జాబితాలో 12 ఏండ్ల కింద 600 స్థానంలో ఉన్న అదానీ..  మోదీ ప్రధాని అయ్యాక ఆయన ర్యాంక్ పైకి పెరుగుతూనే వచ్చిందని, ఇప్పుడు రెండో స్థానానికి ఎగబాకారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ‘అన్ని రంగాలను అదానీకి మోదీ అప్పగించారు. ఏ రంగంలో చూసినా అదానీ పెట్టుబడులే కనిపిస్తాయి. మోదీ ప్రధాని అయ్యాక అదానీ వ్యాపారం బాగా పెరిగింది. పోర్టులు, విమానాశ్రయాలు, గనులు, మౌలిక వసతులతో పాటు అనేక వ్యాపారాలను ఆయనకు ధారాదత్తం చేశారు. లబ్ధి పొందిన అలాంటి వ్యాపారులు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు’ అని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు