భువీకి చోటు కష్టమే
లంకతో సిరీస్‌కు నేడు భారత జట్టు ఎంపిక
ముంబై, నవంబర్ 28 : స్వదేశంలో శ్రీలంకతో(Sri Lanka) జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల(Limited-overs series) కోసం భారత జట్టును(India Squad) ఆదివారం ప్రకటించనున్నారు. డిసెంబర్ 13 నుంచి 27 వరకూ టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అయి తే టీ20 జట్టులో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కివీస్‌తో సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన భువీ పూర్తిగా నిరాశపరిచాడు. నాలుగు టీ20లు ఆడి కేవలం ఒక వికెట్‌తో సరిపెట్టుకున్నాడు. యువ బౌలర్లు మయాంక్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్‌ల నుంచి గట్టిపోటీ ఉంది. అటు వన్డే జట్టులో కోహ్లీ, రోహిత్ మళ్లీ ఫామ్ అందుకోవాలని పట్టుదలగా ఉన్నా రు.