U19 ఫైనల్ ఫైట్.. టాస్ గెలిచిన పాక్
పాక్‌తో తుది సమరం.. ప్రతీకారం తీర్చుకుంటుందా భారత్?
U19 Asia Cup 2026 Final: అండర్-19 ఆసియా కప్ టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ యువ జట్లు ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి ముందు భారీ Target ఉంచి ఒత్తిడిలోకి నెట్టాలని పాక్ భావిస్తోంది. సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన Team India అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్థాన్ టైటిల్ పోరుకు చేరుకుంది. ఇటీవలి మ్యాచ్‌ల్లో ఆ జట్టు కూడా మంచి Formలో ఉండటంతో ఫైనల్ ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ టోర్నీలో గతంలో పాకిస్థాన్ చేతిలో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓటమి ఎదుర్కొంది. ఇప్పుడు అదే ప్రత్యర్థిపై ఫైనల్లో గెలిచి ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని భారత యువ ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. మరోవైపు పాక్ మాత్రం అదే ఆధిపత్యాన్ని కొనసాగించి Asia Cup Trophyని సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ అండర్-19 జట్టు: లక్ష్య రాయచందాని (కెప్టెన్), ఆర్యవీర్ సెహ్వాగ్, వి.కె. వినీత్, యశ్బర్ధన్ సింగ్ చౌహాన్ (వైస్ కెప్టెన్), కుషాగ్ర ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మనల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), రజత్ బాఘేల్ (వికెట్ కీపర్), వి. యశ్వీర్, ఆర్యన్ సావ్సాని, మోహిత్ ఉల్వా, కావ్య పటేల్, షావిన్ వినోద్, ఇషాన్ సూద్.
పాకిస్థాన్ అండర్-19 జట్టు: ఉస్మాన్ ఖాన్, హయామ్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), అహ్మద్ హుస్సేన్, అలీ రజా, హంజా జహూర్ (వికెట్ కీపర్), హస్నైన్ అబ్బాస్ దార్, మహమ్మద్ సయ్యమ్, రిజ్వానుల్లా, నికాబ్ షఫీక్, జహంగీర్ బిలాల్, హుజైఫా అహ్సన్, మహమ్మద్ హుజైఫా, అబ్దుల్ సుభాన్.