మలింగాకు ముంబై గుడ్ బై
మాంబ్రే, హాప్‌కిన్‌సన్ పైనా వేటు
ముంబై, అక్టోబర్ 29: ఐపీఎల్‌లో అత్యంత విజయవంత మైన జట్టు ముంబై ఇండియన్స్(Mumbai Indians) గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా కోచింగ్ బృందంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ముంబై యాజమాన్యం పొల్లార్డ్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. తాజాగా బౌలింగ్ కోచ్ లసిత్ మలింగాతో అనుబంధానికి ము గింపు పలికింది. మరో బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో పాటు ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్‌కిన్‌సన్ పైనా వేటు వేసింది.
ఈ మేరకు సోష ల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. ముంబై ఇండియన్స్ చరిత్రలో అత్యంత ఐకానిక్ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన మలింగ నిష్క్రమణతో ఒక శకం ముగిసినట్లయింది. శ్రీలంకకు చెందిన ఈ దిగ్గ జ ఫాస్ట్ బౌలర్, ముంబై నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆటగాడిగా రిటైర్ అయ్యాక, 2018లో జట్టుకు మెంటార్‌గా సేవలందించాడు. తొమ్మిదేళ్ల పాటు బౌలిం గ్ కోచ్‌గా ఉన్న షేన్ బాండ్ స్థానంలో, 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు మలింగ బాధ్యతలు చేపట్టాడు. ఈ మధ్యలో రెండేళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కూడా కోచ్‌గానూ పనిచేశాడు.అలాగే టీమిండియా మాజీ పేసర్ పరాస్ మాంబ్రే భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించి, టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగమయ్యాడు.