స్పోర్ట్ ఈ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 5, 2026: స్పోర్ట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ను రాష్ట్ర సమా చార సాంకేతికత, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu), ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వర్నాథ్తో కలి సి, భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. ఈ సాప్ట్వేర్ ప్లాట్ ఫామ్ క్రీడా వేదికలు, స్పోర్ట్స్ అకాడమీల నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా రూపొందింది.
క్రీడా మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా పనిచేయాలంటే తెరవెనుక బలమైన నిర్వహణ వ్యవస్థ అవసరమని గోపీచంద్ వ్యాఖ్యానించారు. స్పోర్ట్ ద్వారా క్రీడా వేదికలను నిర్వహించే వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నామని తెలిపారు. తద్వారా వారు పరిపాలనా అం శాల కంటే క్రీడాకారులు, క్రీడా సమాజ అభివృద్ధిపై మరింత దృష్టి సారించగలుగుతారు అభిప్రాయపడ్డారు. శ్రీకాంత్ పునాటి, శ్యామ్ కతురోజుతో కలిసి ప్రారంభించిన ఈ వెంచ ర్ క్రీడా రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు.