కెప్టెన్‌గా భావిక

29-11-2026 | 05:10am

అండర్ 19 మహిళల ఆసియాకప్‌కు జట్టు ప్రకటన

ముంబై, నవంబర్ 28: వచ్చే నెలలో యూఏఈ వేదికగా జరగనున్న అండర్ -19 మహిళల ఆసియా కప్(Women's Asia Cup) కోసం భారత జట్టు ను ప్రకటించారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ యువ జట్టుకు వికెట్ కీపర్-బ్యాటర్ భావిక అహిరే కెప్టెన్‌గా ఎంపికైంది. వైస్ కెప్టెన్‌గా అనాది టాగ్డే వ్యవహరించనుంది. అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2027ను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు జట్టును ఎంపిక చేశారు.  అండర్ -19 మహిళల ఆసియా కప్ డిసెంబర్ 8 నుంచి మొదలుకానుంది.

భారత అండర్-19 జట్టు 

భావిక అహిరే (కెప్టెన్, వికెట్ కీపర్), ఇరా జాదవ్, నిధి మహతో, పూర్వా సివాచ్, మ హక్ నర్వాసే, మైత్రి మణియార్, ఈశ్వరి అవాసరే, దీయా యాదవ్, శ్రేయ ఎస్ చవా న్ (వికెట్ కీపర్), సమైరా రాఘవ్, కుమారి పాలక్, ఉమా కాష్వి, అచ్సా పర్మార్, అనాది టాగ్డే (వైస్ కెప్టెన్), పాలక్ సింగ్.

మరిన్ని వార్తలు