డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బ్రాన్సన్ రీడ్ మృతి

29-11-2026 | 05:10am

న్యూయార్క్, నవంబర్ 28: ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(World Wrestling Entertainment)(డబ్ల్యూడబ్ల్యూఈ)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ బ్రాన్సన్ రీడ్ 38 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో రీడ్ చనిపోయినట్టు డబ్ల్యూడబ్ల్యూఈ యాజమాన్యం తెలిపింది. ఆస్ట్రేలియాకు చెందిన రీడ్ 2007 లో రెజ్లింగ్ కెరీర్ ప్రారంభించారు. 2019 లో డబ్ల్యూడబ్ల్యూఈలోకి ఎంట్రీ ఇచ్చిన అతను ఎన్‌ఎక్స్‌టీ నార్త్ అమెరికా ఛాంపియన్‌షిప్ గెలుచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కండరాల గాయంతో కొద్దికాలం రెజ్లింగ్‌కు దూరంగా ఉన్న రీడ్ ఇటీవలే రింగ్‌లోకి అడుగుపెట్టా రు.

నవంబర్ 7న సౌదీ అరేబియాలో జరిగిన క్రౌన్ జెవెల్ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు గాయపడ్డారు. ఈ లైవ్ ఈలెంట్‌లో మరో రెజ్లర్ రీడ్‌ను పైకెత్తి టేబుల్‌పై పడేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటనలో పక్కటెముకలు విరగడంతో పాటు కిడ్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్టు చెబుతున్నారు. అయితే రీడ్ మృతికి ఈ ఘటనే కారణమని చెప్పలేమని డబ్ల్యూడబ్ల్యూఈ వర్గాలు తెలిపాయి. కేవలం 38 ఏళ్ల వయసులోనే బ్రాన్సన్ రీడ్ చనిపోవడంపై డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులు ది గ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని వార్తలు