జాతీయస్థాయి పోలీస్ గేమ్స్‌కు ఎంపికైన కానిస్టేబుల్ లావణ్య

09-11-2026 | 08:25pm

హుజూర్ నగర్,నవంబర్ 09: ​రాష్ట్రస్థాయి క్రీడల్లో(State level sport) అద్భుత ప్రతిభ కనబరిచిన మహిళ కానిస్టేబుల్ లావణ్య(Woman Constable Lavanya) సూర్యాపేట జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని హుజూర్ నగర్ సీఐ చరమందరాజు అన్నారు. హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళ కానిస్టేబుల్ లావణ్య రాష్ట్రస్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో ఆమె కనబరిచిన అత్యుత్తమ ప్రతిభే ఆమెను జాతీయస్థాయి వరకు తీసుకువెళ్లింది.

సోమవారం పట్టణంలోని సీఐ కార్యాలయంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన కానిస్టేబుల్ లావణ్యను పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ చరమందరాజు మాట్లాడుతూ...త్వరలో తమిళనాడులో జరగబోయే జాతీయ పోటీల్లోనూ ఆమె ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి, పోలీస్ శాఖకు పతకం సాధించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్, బలరాంరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు