శ్రీరామ దూత హనుమకు పంచామృతాభిషేకాలు
నేరేడుచర్ల నవంబర్ 3(విజయ క్రాంతి): నేరేడుచర్లలోని శ్రీ కోదండ రామాలయంలో(Sri Kodanda Ramalayam) కొలువైన శ్రీ రామదూత ఆంజనేయ స్వామికి మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో పంచామృతాభిషేకాలు చేశారు, ఆలయ పూజారి కొలచిన దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో వేదమంత్రాలతో సాంప్రదాయ సిద్ధంగా ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార, గంధం,తేనె, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు పూలమాలలతో పూలతో ప్రత్యేకంగా అలంకరించి తమలపాకులతో పూజ లు నీరాజనా మంత్రపుష్పం తీర్థ ప్రసాద వినియోగం చేశారు.
ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొణతం సత్యనారాయణ రెడ్డి,చింతకుంట్ల పూర్ణచంద్రారెడ్డి, తాటికొండ వెంకటరెడ్డి, పొనుగోటి జంగారావు, ఉప్పల కృపాకర్, చింతకుంట్ల శ్రీనివాసరావు, రాగిరెడ్డి గోపాల్ రెడ్డి,మా శెట్టి సైదయ్య, తాటికొండ సత్యనారాయణ రెడ్డి, జెట్టి వెంకన్న, గొళ్ల సుధాకర్, మురారిశెట్టి రమేష్, గుండా సత్యనారాయణ, కిషోర్, లచ్చిరెడ్డి, కాంపెల్లినారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు