క్రీడలతో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది

18-11-2026 | 06:08pm

మండల విద్యాధికారి బోయిని లింగయ్య

తుంగతుర్తి, (విజయ క్రాంతి): క్రీడలతో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం(Self-confidence) పెంపొందుతుందని గుర్తింపు లభిస్తుందని మండల విద్యాధికారి భోగిని లింగయ్య (Education Officer Bhogini Lingaiah)అన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు తుంగతుర్తి మండల స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలను బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో, అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి  మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల పిల్లలలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ చిన్నారులు అందరితో సమానంగా సమాజంలో మమేకమయ్యేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా విద్యార్థుల కోసం పలు రకాల క్రీడా, సాంస్కృతిక పోటీలను నిర్వహించారు.

క్రీడలు: కబడ్డీ, రింగ్ బాల్స్, క్యారమ్ బోర్డ్, చెస్.ఉపన్యాస పోటీలు , వ్యాసరచన, చిత్రలేఖనం , క్విజ్  గానం, నృత్యం.

పోటీల అనంతరం మండల విద్యాధికారి అధ్యక్షతన ప్రత్యేక సభా వేదికను ఏర్పాటు చేసి, ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన విజేతలతో పాటు, ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలందరికీ బహుమతులను అందజేసి ప్రోత్సహించారు. కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులందరికీ, వారి తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజన వసతిని కల్పించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చలపతి, ఐఆర్సి గుండ గాని ఉపేందర్, మీద పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు