ఘనంగా విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకలు
తుంగతుర్తి,(విజయక్రాంతి): భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా అన్నారం గ్రామ క్రికెట్ మైదానంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక క్రికెటర్లకు భోజన వితరణ చేశారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ అభిమాని రేగటి శ్రీనివాస్ మాట్లాడుతూ... విరాట్ కోహ్లీ నుంచి కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా, ఆయన కష్టపడే తత్వం, క్రమశిక్షణ, పట్టుదల, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయని స్వభావాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని అన్నారు. ఈ లక్షణాలను చదువు, ఉద్యోగం, వ్యాపారం వంటి ఏ రంగంలోనైనా ఆచరిస్తే మన లక్ష్యాలను తప్పకుండా చేరుకోగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రికెటర్లు, యువకులు పాల్గొన్నారు.