మానవత్వం చాటుకున్న దాతలు

10-11-2026 | 06:01pm

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం

నల్లబెల్లి, నవంబర్ 10( విజయక్రాంతి ) : మండలంలోని నాగరాజుపల్లి గ్రామంలో(Nagarajupalli Village) అనారోగ్యంతో మృతి చెందిన నిరుపేద పొడేటి ప్రకాశం కుటుంబానికి దాతలు అండగా నిలిచారు. కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో(Severe financial difficulties) ఉండి అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దయనీయ స్థితిని స్థానిక హెచ్‌ఎం కర్ణకంటి రామ్మూర్తి. గీసుకొండకు చెందిన రిటైర్డ్ ఎస్‌బీఐ మేనేజర్, సామాజిక సేవకులు(Social workers) పెగళ్ళపాటి లక్ష్మినారాయణ దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన లక్ష్మినారాయణ రూ. 5 వేల ఆర్థిక సాయం అందించగా. ఉపాధ్యాయులు రామ్మూర్తి, కూనమళ్ల రాజన్‌బాబు ఆ నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎరుకల రఘు, మద్ది మేడారం జాతర చైర్మన్ పబ్బు రాజేష్ గౌడ్, బైరి అశోక్, రమేష్, ముత్యాల రమేష్ బాబు, ఆకుల సతీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు