పక్షవాతం లక్షణాలపై నిర్లక్ష్యం వద్దు

30-10-2026 | 05:00am
  1. అపోలో ఆస్పత్రి వైద్యుల సూచన
  2. ఆస్పత్రిలో సమగ్ర స్ట్రోక్ చికిత్స సేవలు

హైదరాబాద్, అక్టోబరు 29 (విజయక్రాంతి): పక్షవాతం(స్ట్రోక్) లక్షణాలను గుర్తించిన వెంటనే వైద్య సహాయం పొందాలని అపోలో ఆసుపత్రుల వైద్యులు సూచించారు. ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం(World Stroke Day) సందర్భంగా ఏఐ ఆధారిత సాంకేతికతతో అత్యవసర చికిత్స నుంచి పునరావాసం, ఇంటి వద్ద వైద్య పర్యవేక్షణ వరకు 360 డిగ్రీల సమగ్ర సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

అపోలో కన్సల్టెంట్ న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ గిర్గాని, కన్సల్టెంట్ న్యూ రాలజిస్టులు డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ సి. రాజేష్ రెడ్డి, డాక్టర్ సందీప్ నాయని ఈ సేవల వివరాలను వెల్లడించారు. రోబోటిక్ పునరావాసం, ఫిజియోథెరపీ, న్యూరో ఐసీయూ, థ్రాంబోలైసిస్, అర్హులైన రోగులకు మెకానికల్ థ్రాంబెక్టమీ వంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటి వద్ద నర్సింగ్ సేవలు, రిమోట్ మానిటరింగ్, మాట, మింగడం, రోజువారీ పనుల సామర్థ్యాన్ని మెరుగుపరిచే చికిత్సలు అందిస్తున్నామన్నారు.

కన్సల్టెంట్ న్యూరాల జిస్టులు డాక్టర్ వేముల శ్రీకాంత్, డాక్టర్ జి. రంజిత్, డాక్టర్ మాధురి, డాక్టర్ సౌమ్య శర్మ, డాక్టర్ దీపిక సిరినేని, డాక్టర్ హెచ్. రాహుల్, డాక్టర్ సందీప్ గుర్రం, డాక్టర్ ఎ. వెంకట్‌రెడ్డి, డాక్టర్ జి. చార్వి త రెడ్డి, డాక్టర్ ఎ. సంతోష్ శ్రీరామ్ మాట్లాడుతూ పక్షవాతం శరీర కదలికలతోపాటు వ్యక్తిత్వం, భావోద్వేగాలు, ప్రవర్తనపై ప్రభా వం చూపవచ్చన్నారు. సకాలంలో చికిత్స, పునరావా సం, కుటుంబ సభ్యుల సహకారం కీలకమ న్నారు. అపోలో ఆసుపత్రుల డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ కె. సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలన్నారు.

మరిన్ని వార్తలు