డిసెంబర్ 9 చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

21-11-2026 | 07:47pm

ఉట్నూరు, నవంబర్ 21 ( విజయక్రాంతి): ఉట్నూరు మండల(Utnoor Mandal) కేంద్రంలోని కుమురం భీమ్ కాంప్లెక్స్ వద్ద ఆదివాసీ 9 తెగలు, గోండ్వాణ పంచాయతీ రాయి సెంటర్ తుడుం దెబ్బ, వివిధ ఆదివాసీ సంఘాల(Tribal organizations) ఆధ్వర్యంలో డిసెంబర్ 9న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా గోండ్వాణ పంచాయతీ రాయి సెంటర్ తుడుం దెబ్బ నాయకులు మాట్లాడుతూ, ఆదివాసీల హక్కులు, అస్తిత్వం మరియు భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్న డిసెంబర్ 9 చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఆదివాసీ ప్రజలు, యువతీ యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు