ఆటో బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు
21-11-2026 | 08:12pm
చిన్నంబావి, నవంబర్ 21: ఆటో, బైక్ ఢీకొన్న(Auto and bike collided) ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్ద దగడ గ్రామానికి చెందిన చంద్రమోహన్(Chandramohan) (46)మండల కేంద్రానికి గ్రామం నుంచి బైక్పై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో వేగంగా ఢీకొన్నది. చంద్రమోహన్ కు కుడి కాలుకు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం చంద్రమోహన్ ను 108లో జిల్లా ఆసుపత్రికి(District Hospital) తరలించారు.