సింగరేణి మండలంలో పర్యటించిన మనీషా మదన్ లాల్
సింగరేణి నవంబర్ 21 విజయక్రాంతి: వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్(Former Wyra MLA Banoth Madan Lal) తనయ మనిషా లక్ష్మి శనివారం కారేపల్లి మండలంలో పర్యటించారు. రేలకాయలపల్లిలో బీఆర్ఎస్ నాయకులు గణితి ముత్యాలరావు(BRS leader Ganiti Muthyala Rao) గృహ ప్రవేశకార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో(BRS leaders and activists) పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పనితీరుతో ప్రజలలో వస్తున్న వ్యతిరేకత గురించి చర్చించారు. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలకు అండగా నిలిచిన వారే నిజమైన నాయకులని అని అన్నారు. తన తండ్రి మదన్ లాల్ కార్యకర్తల వెంటే ఉండి వారి కష్ట సుఖాలలో పాలుపంచుకున్నారని, ఆదే బాటలో తాను నడుస్తున్నట్లు తెలిపారు.
ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు ఉన్నం వీరేందర్, వాంకుడోత్ జగన్ నాయక్, మాజీ ఎంపీటీసీ బానోత్ శంకర్, జైత్రంతండ సర్పంచ్ బానోత్ మంగ చిన్న, బిఆర్ఎస్ నాయకులు గణితి సత్యనారాయణ, డొంకెన రవీందర్, మాలోత్ స్వామి, మణికొండ నాగేశ్వరావు, పాలిక వీరస్వామి, పేర్ని వెంకటేశ్వర్లు, శంకర్, జడల కళ్యాణ్, సోమందల నాగరాజు, గుగులోత్ జుంకీలాల్, భూక్యా మధు, బావుసింగ్, పొడుగు హరీష్ తదితరులు పాల్గొన్నారు.