డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుల్లో వార్డ్ ఆఫీసర్ చేతివాటం
విధుల నుంచి తొలగించిన కలెక్టర్
తొర్రూర్: మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తొర్రూరు పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల(Double-bedroom houses) కేటాయింపుల్లో లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై నిర్వహించిన విచారణలో వాస్తవమని రుజువు కావడంతో మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న జే.మనేశ్వర్ ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్(District Collector Sneha Sabarish) తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.