గంజాయి మొక్కల పెంచుతూ అక్రమంగా విక్రయం

21-11-2026 | 08:38pm

మల్కాజిగిరి ఎస్ఓటి టీం, జవహర్ నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్

జవహర్ నగర్,(విజయక్రాంతి): గంజాయి మొక్కలను(Cannabis sativa) పెంచుతూ వాటి నుండి వచ్చే ఎండు గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్(Jawahar Nagar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు, ఎస్ఓటి మల్కాజిగిరి జోన్ టీం ఇన్స్పెక్టర్ జి. జానయ్య తెలిపిన వివరాల ప్రకారం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ సంతోష్ నగర్ లో చిలకల సాయి దినేష్ ( 22) బీటెక్ విద్యార్థి చిలకల సాయి తండ్రి ప్రేమ్ కుమార్ తో కలిసి బాలాజీ నగర్ లోని సంతోష్ నగర్ లో నివాసం ఉంటున్నారు.

విశ్వసనీయమైన సమాచారం మేరకు ఎస్ఓటి మల్కాజిగిరి జోన్ టీం, జవహర్ నగర్ పోలీసులు ఈనెల 20వ తేదీన సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి బాలాజీ నగర్ లోని సాయి దినేష్ ఇంటి వద్ద ఎండు గంజాయి, రెండు సజీవ గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని నిందితుడు సాయి దినేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుడు తన నివాసంలో రెండు గంజాయి మొక్కలు సుమారు నాలుగు గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్ను స్వాధీనం చేసుకొని నిందితుడని దర్యాప్తు నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ చదువుతున్న నిందితుడు గంజాయి వినియోగానికి అలవాటు పడి అనంతరం అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నట్టు గుర్తించారు.

ఈ మేరకు నిందితుడిపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు మల్కాజిగిరి కమిషనరేట్ నిరంతరం నిఘా కఠినమైన చట్టాలను అమలు చేస్తుందని గంజాయి విక్రతలను గుర్తించడం వారి నెట్వర్క్ లను చేదించడం మాదకద్రవ్యాల అక్రమ సాగు సేకరణ రవాణా పంపిణీలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయని తెలిపారు . ఈ ఆపరేషన్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో మల్కాజిగిరి జోన్ డిసిపి శ్రీధర్, ఎస్ఓటి డిసిపి కె. మనోహర్, జవహర్ నగర్ డివిజన్ ఏసిపి ఎస్. చక్రపాణి, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఓటి మల్కాజ్గిరి జోన్ టీం తదితర బృందాలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు