ముదిరాజులకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించాలి
బీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించాలి
మహబూబ్‌నగర్: ముదిరాజులకు రాజ్యాధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించాలని తెలంగాణ ముదిరాజ్(Telangana Mudiraj) మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్(Pedda Vijay Kumar Mudiraj), జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో హామీలను(Congress election manifesto promises) అమలు చేయాలని, ముదిరాజులను తగిన బీసీ గ్రూపులోకి మార్చడంతో పాటు బీసీ కార్పొరేషన్‌కు(BC Corporation) రూ.1,000 కోట్లు కేటాయించాలని కోరారు. డీలిమిటేషన్‌లో(Delimitation) జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, పాతూర్ కుమార్, బాల, ప్రకాష్ ముదిరాజ్, రాము, మైత్రి యాదయ్య, శ్రీనివాస్, ఊరిని చెన్నయ్య, సురేష్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, గోపి, టంకర రాజు, దోమ వెంకటేష్, తిరుమలేష్, శివన్న తదితరులు పాల్గొన్నారు.