విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

21-11-2026 | 08:29pm

- వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఏ ఎస్ డబ్ల్యూ ఓ హనుమంతరావు 

- విజయ్ క్రాంతి ఎఫెక్ట్ 

మణుగూరు,(విజయక్రాంతి): విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఏఎస్ డబ్ల్యూఓ హనుమంతరావు(ASWO Hanumanta Rao) హెచ్చరించారు. ఈనెల 18న విజయ క్రాంతిలో ప్రచురితమైన "సంక్షేమ విద్యార్థుల.... సౌకర్యాల వ్యధ" కథనానికి స్పందించారు. శనివారం మండలంలోని అశోక్ నగర్ లోని బాలురు సంక్షేమ వసతి గృహాన్ని ఆయన పరిశీలించి తనిఖీ చేశారు. సంక్షేమ గృహంలో కొరవడిన సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

వసతి గృహంలో సౌకర్యాలు అందడం లేదని విద్యార్థులు(Students) ఎస్డబ్ల్యూకు తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజన సదుపాయాలు కల్పించాలని సంక్షేమ అధికారి నరేష్ కు తెలిపారు. విధుల పట్ల అలసత్వం వహించిన, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న కఠినమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా అధికారికి నివేదికల సమర్పిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు