జనగామ భద్రతకు పోలీసుల భరోసా!

21-11-2026 | 08:16pm

గ్రామస్తుల సహకారంతో 12 కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటు

మదున పోచమ్మ బోనాల జాతరకు భారీ బందోబస్తు

అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు

భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ , కోటపల్లి ఎస్‌ఐ రాజశేఖర్ 

కోటపల్లి, ( విజయక్రాంతి ) : గ్రామంలో నేరాల నియంత్రణ(Crime Control), ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖ(Police Department) నిఘాను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా(Mancherial District) కోటపల్లి పోలీస్ స్టేషన్(Kotapalli Police Station) పరిధిలోని జనగామ గ్రామంలో గ్రామస్తుల సహకారంతో 12 కమ్యూనిటీ సీసీ కెమెరాలను(CCTV cameras) ఏర్పాటు చేశారు. ఈ నిఘా వ్యవస్థను(Surveillance system) చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పోలీస్ ప్రారంభించారు. గ్రామంలో జరిగే ప్రతి కదలికపై నిఘా ఉంచడంతో పాటు నేరాల నియంత్రణకు ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రజల భద్రత కోసం గ్రామస్తులు ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని పోలీసులు పేర్కొన్నారు.

మరోవైపు ఈ నెల 24, 25, 26 తేదీల్లో జనగామ గ్రామంలో జరగనున్న మదున పోచమ్మ బోనాల జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ , కోటపల్లి ఎస్‌ఐ రాజశేఖర్ గ్రామాన్ని సందర్శించి జాతర బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పార్కింగ్ స్థలాలు, క్యూ లైన్లు, రద్దీ నియంత్రణ, భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి,గ్రామ సర్పంచ్ తిరుపతి, గ్రామ పెద్దలు, స్థానికులతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు.

జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు భద్రతకు మరింత బలాన్నిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని, జాతరకు వచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటించి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు కోరారు.

మరిన్ని వార్తలు