పేదలకు వరం
28-10-2026 | 03:54pm
అక్టోబర్ 28, విజయక్రాంతి : కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలు(Kalyana Lakshmi and Shaadi Mubarak schemes) పేదలకు వరం అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలో 37 మంది లబ్దిదారులకు రూ. 37.41 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. పలు సంక్షేమ పథకాలను అర్హులకు అందేవిధంగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.