గంజాయి మొక్క పెంచుతున్న వ్యక్తిపై కేసు నమోదు

05-11-2026 | 03:40pm

బోథ్. నవంబర్ 5, (విజయ క్రాంతి): సోనాల మండల కేంద్రంలో(Sonala Mandal Headquarters) తన ఇంటి వెనక బాత్రూం సమీపంలో గంజాయి మొక్క(Cannabis plant) పెంచుతున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించగా గ్రామానికి చెందిన చౌహన్ జైపాల్ సింగ్ అనే వ్యక్తి ఇంటి వెనుక నుండి గంజాయి మొక్కను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వి పురుషోత్తం తెలిపారు.

నిందితుడు గతంలో గంజాయి సేవించేవాడని దీంతో గంజాయి విత్తనాలు సేకరించి డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో రహస్యంగా మొక్కను పెంచుతున్నట్లు విచారణలో తేలింది అన్నారు. ఎవరైనా గంజాయి సాగుచేసిన విక్రయించిన సేవించిన కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు