వాలీబాల్‌లో సాత్విక సత్తా.. రాష్ట్రస్థాయికి ఎంపిక

05-11-2026 | 03:47pm

భూపాలపల్లి జిల్లా, గణపురం, నవంబర్ 05 (విజయక్రాంతి): గణపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విద్యార్థిని మారేపల్లి సాత్విక వాలీబాల్‌లో (Volleyball) ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఆమె ఎంపికతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి అప్రోచ్ అహ్మద్ సాత్వికను అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు (Sports Talent) రాణించేలా ప్రోత్సహించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సాత్వికను కస్తూర్బా గాంధీ పాఠశాల ఎస్‌వో లావణ్య, పీఈటీ గుగులోతు శ్రీదేవి, సిబ్బంది, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థినులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ (State Level Volleyball) మరింత ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గణపురం మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు