పాల కేంద్రం ప్రారంభం

05-11-2026 | 03:48pm

నిర్మల్, నవంబర్ 5 ( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలోని శాంతినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పాల కేంద్రాన్ని ఈ రోజు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి(Municipal Vice-Chairman Appala Ganesh Chakravarthi) ప్రారంభించారు మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడానికి నూతనంగా పాల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం.

అభినందనీయమని పేర్కొన్నారు. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్.పి. రాజు, చెనిగరపు నరేష్, పెండం శ్రీనివాస్, కొండాజీ రాఘవేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు