ఆటల పోటీలతో బాలల దినోత్సవ వేడుకలు

18-11-2026 | 04:10pm

తలమడుగు నవంబర్ 18(విజయక్రాంతి): తలమడుగు మండల మహిళా సమాఖ్య(Mandal Women's Federation) ఆధ్వర్యంలో నైబర్‌హుడ్ సెంటర్‌లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు డీఆర్డీఏ డీపీఎం రామకాంత, ఏపీఎం శేఖర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు సాంబయి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ నర్సింహులు, సీసీలు స్వామి,రమేష్, ఆనంద్ రెడ్,సమత,మోహన్, సురేష్ రెడ్డి,ఎన్‌హెచ్‌సీ సిబ్బంది, సీబీఆర్ వర్కర్లు, దివ్యాంగ పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు