సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

18-11-2026 | 03:49pm

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్

ఆసిఫాబాద్( విజయ క్రాంతి): విద్యార్థులు(Students) సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటూ పుస్తక పఠనంపై(Reading Books) దృష్టి సారించి, నిర్దిష్ట లక్ష్యంతో ఉన్నత విద్యను అభ్యసించాలని టీయూడబ్ల్యూజే(TUWJ) (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్(Abdul Rahman) సూచించారు. జిల్లా స్థాయి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ వ్యాసరచన, క్విజ్ పోటీల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన ఏపీజే అబ్దుల్ కలాం హైస్కూల్ 9వ తరగతి విద్యార్థి కే. శ్రీనివాస్‌ను బుధవారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ దివంగత జర్నలిస్టు వెంకటి సేవలు చిరస్మరణీయమని, ఆయన కుమారుడు శ్రీనివాస్‌కు టీయూడబ్ల్యూజే అండగా ఉంటుందని తెలిపారు. విద్యార్థిని శాలువా, మెడల్‌తో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ అబుల్ ఫయాజ్, ట్రస్మా జిల్లా నాయకుడు చిలుకూరి రాధాకృష్ణ చారి, టీయూడబ్ల్యూజే జిల్లా నాయకుడు సలీం బేగ్, ప్రిన్సిపాల్ హాశం పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు