అన్ని వర్గాల సంక్షేమం కోసం గత ప్రభుత్వం కృషి

18-11-2026 | 04:01pm

బోథ్. నవంబర్ 18 (విజయ క్రాంతి) గత ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను(Scheme for welfare) ప్రవేశపెట్టి అమలు చేసిందని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్(EX-Chief Minister KCR) ఆలోచనతో వృద్ధులకు అండగా నిలిచారన్నారు బుధవారం సోనాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల ఆవరణలో ప్రభుత్వపరంగా మంజూరైన ఆసరా పెన్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలు అందించారు.

అప్పటి ప్రభుత్వం రైతులు మహిళలు వృద్ధులు దివ్యాంగులు నిరుపేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేసిందని గుర్తు చేశారు కళ్యాణ లక్ష్మి పథకం తో పాటు వికలాంగులకు సరితం అండగా నిలిచారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, ఆత్మ చైర్మెన్, రాజు యాదవ్లు పాల్గొని తమ ప్రభుత్వం ఎంతోమంది పేదలకు అండగా నిలిచిందని రేషన్ కార్డులు మంజూరు చేసి అర్హులందరికీ పెన్షన్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనన్నారు. పెన్షన్ల కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న వారికి ప్రస్తుతం ముఖ్యమంత్రి బాసటగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బిందుజఎంపీడీవో రత్నాకర్ రావు తో పాటు తాసిల్దార్ మల్లేష్ పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు