ప్రజా సంక్షేమమే .. ప్రభుత్వ లక్ష్యం..
- ఇందిరమ్మ భీమా.. పేద కుటుంబాలకు ధీమా...
- ఈనెల 19 నుండి రేషన్ కార్డ్, ఆధార్ కార్డుతో నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపు..
- 1087 మందికి నూతన పెన్షన్ మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...
ఉట్నూర్, నవంబర్ 18( విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వ(People's Government) లక్ష్యం పేద ప్రజల కు సంక్షేమ పథకాలు(Welfare Schemes) అందించి, వారిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పని చేస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. బుధవారం
ఉట్నూరు మండల కేంద్రంలో చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని 1087 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన వారికి పెన్షన్లు అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రేపటి నుంచి ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు జీవిత బీమా భరోసా కల్పించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే గారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.