పీహెచ్డీ పట్టా అందుకున్న గురుకులం ప్రిన్సిపాల్
అశ్వాపురం, నవంబర్ 18 (విజయక్రాంతి): మణుగూరు గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల(Tribal Welfare Residential Degree College) ప్రిన్సిపాల్ బండారుపల్లి రవి ఒడిశా రాష్ట్రంలోని కటక్ శ్రీశ్రీ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు.
ఈ నెల 15న విశ్వవిద్యాలయం నిర్వహించిన 15వ స్నాతకోత్సవంలో ఒడిశా ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ తేజ్ ప్రతాప్ తదితరుల చేతుల మీదుగా పట్టా స్వీకరించారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లింగపాలెం గ్రామానికి చెందిన రవి ప్రభుత్వ కళాశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి,
2005లో జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించారు. నార్నూర్, దమ్మపేట గురుకుల కళాశాలల్లో విధులు నిర్వహించి, 2018లో డిగ్రీ లెక్చరర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం మణుగూరు టీడబ్ల్యూటీఆర్ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు పీహెచ్డీ పట్టా లభించడంపై ఆర్సీవో అరుణకుమారి, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.