పిసిసి అధ్యక్షుని కలిసిన హరీష్

18-11-2026 | 03:52pm

నిర్మల్ నవంబర్ 18 ( విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ (Congress Party) పట్టణ అధ్యక్షులు ఆకుల హరీష్ బుధవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud) హైదరాబాదులో కలిసి సన్మానం చేశారు. అలాగే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా క్యాంప్ కార్యాలయంలో కలిసి సన్మానం చేశారు.

నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని ఆయనకు వివరించారు. పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వారిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతల తెలిపినట్టు వివరించారు

మరిన్ని వార్తలు