యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలుగా పద్మారాణి

18-11-2026 | 03:55pm

ములకలపల్లి,నవంబర్ 18 (విజయక్రాంతి): ఇటీవల భద్రాచలం పట్టణంలో నిర్వహించిన టిఎస్ యు.టి.ఎఫ్. భద్రాద్రి కొత్తగూడెం(TS UTF, Bhadradri Kothagudem) ఆరవ జిల్లా మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో టీఎస్ యు.టి.ఎఫ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఎం.పద్మ రాణి (ఎస్.ఎ. బయాలజీ జడ్.పి.హెచ్.ఎస్ ములకలపల్లి) ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. వీరికి ములకలపల్లి టీఎస్ యు.టి.ఎఫ్. మండల కమిటీ బాధ్యులు బుధవారం అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు