తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రారంభించిన కలెక్టర్

13-11-2026 | 08:21pm

మారుమూల ప్రాంతాల ప్రజలు, రైతులకు బ్యాంకింగ్ సేవలు చేరువ చేయడమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

బేల నవంబర్ 13 (విజయక్రాంతి): బేల మండలం సాంగిడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంకును(Telangana Grameena Bank) శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) స్థానిక నాయకులు, బ్యాంకు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల ప్రజలు, రైతులకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు బ్యాంకులు అందించే వివిధ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి, స్థానిక నాయకులు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు