59 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

05-11-2026 | 03:35pm

ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేతుల మీదుగా చెక్కుల అందజేత

బేల నవంబర్ 05 (విజయక్రాంతి): మండల కేంద్రంలోనీ గణేష్ గార్డెన్ లో(Ganesh Garden) కళ్యాణలక్ష్మి పథకం(Kalyana Lakshmi Scheme) కింద 59 మంది లబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు కళ్యాణలక్ష్మి పథకం ఆర్థిక భరోసా కల్పిస్తోందని, లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రవీణ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు