మానసిక ఒత్తిడిని జయిస్తే ఆత్మహత్యలు నివారించవచ్చు
బోథ్. నవంబర్ 13 (విజయక్రాంతి): మానసిక ఒత్తిడిని(Mental stress) తట్టుకుంటే ఆత్మహత్యల వైపు వెళ్ళరని ప్రముఖ మానసిక వైద్యులు(Psychiatrists) డాక్టర్ ఓం ప్రకాష్ పేర్కొన్నారు. శుక్రవారం సోనాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో(Government High School) విద్యార్థులకు మానసిక ఒత్తిడి తట్టుకునే ది ఎలా అనే అంశంపై వివరించారు. తోటి విద్యార్థుల(Students') ఒత్తిడి తల్లిదండ్రుల ఒత్తిడి ఉపాధ్యాయుల ఒత్తిడి వంటి వాటి వల్ల విద్యార్థులు సతమతమవుతుంటారని అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని సమస్యను పరిష్కరించే దిశగా మానసిక ఒత్తిడిని తట్టుకొని ముందుకు నడవాలి అన్నారు.
చదువు భారం కాదని భావించి చదివితే ఒత్తిడిని తట్టుకోగలుగుతారన్నారు. అనేకమంది విద్యార్థులు కొత్తలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దీనివల్ల పిల్లలపై తల్లిదండ్రుల ఆశలు కన్న కలలు అడియాశలైతున్నాయన్నారు. సమస్యను పరిష్కరించేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించారు.
సమావేశంలో డాక్టర్ రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకుంటే వ్యక్తిత్వం దృఢంగా ఉంటుందని మనం తీసుకునే ఆహారం పైన ప్రతిదీ మన మానసిక స్థితి ఉంటుందన్నారు. సరైనఆహారం తీసుకుంటే మనిషి మానసికంగా శారీరకంగా బలంగా ఉంటారన్నారు. ఎదుగుతున్న దశలో పౌష్టికాహారం ఎంతో అవసరం అన్నారు. సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాల్గొన్నారు.