అంత్యక్రియలకు ఆర్థిక సాయం

13-11-2026 | 08:28pm

రాజాపూర్ నవంబర్ 13: మండలంలోని ఖానాపూర్ గ్రామానికి(Khanapur village) చెందిన టైలర్ జహంగీర్ ఖాన్(45) అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుని అంత్యక్రియలకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చించోడ్ అభిమన్యు రెడ్డి రూ. 5వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. శుక్రవారం అభిమన్యు యువసేన సభ్యులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్  పూజారి శేఖర్, ముస్తఫా, సాదిక్, మైనొద్దీన్, హశం, కైసర్, దస్తగీర్, ఖజపాష, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు