అమ్మ నీ దయతోనైనా మా డిమాండ్ నెరవేర్చాలి

05-11-2026 | 03:43pm

నిర్మల్ జిల్లాలో వినూత్న రీతిలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరసన పోచమ్మకు బోనాలు 

నిర్మల్ ,నవంబర్ 5 ( విజయక్రాంతి): వైద్య ఆరోగ్య శాఖలో(Department of Medical and Health) నేషనల్ హెల్త్ మిషన్(National Health Mission) ద్వారా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 24 రోజుకు చేరుకున్నాయి.

తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం తాము 24 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పాలకులు పట్టించుకోకపోవడంతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దీక్షా శిబిరంలోని బోనాలను వండుకొని ఉద్యోగులు శివసత్తుల విన్యాసం, పోతరాజుల, పోతరాజుల నృత్యాల మధ్య దీక్ష శిబిరం నుండి బస్ డిపో బోయవాడ అడెల్లి పోచమ్మ ఆలయం వరకు బోనాలతో వెళ్లి బోనాలు సమర్పించుకున్నారు.

అమ్మవారి దయతో ప్రభుత్వం పై కరుణ ఏర్పడి తమ డిమాండ్లు పరిష్కరించేలా అమ్మవారి దీవెన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రసాదించాలని మొక్కులు మొక్కుకున్నట్టు ఉద్యోగులు తెలిపారు ఈ కార్యక్రమంలో గంగాధర్ రమణ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు