డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 42 మందికి జైలు శిక్ష
- మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు
- గజ్వేల్ ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ
గజ్వేల్, అక్టోబర్ 14: మద్యం సేవించి వాహనాలు నడిపిన 42 మందికి గజ్వేల్ ప్రిన్సిపల్ జ్యుడీషియల్(Gajwel Principal Judicial) ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జైలు శిక్షలు విధించింది. వీరిలో 16 మందికి ఒక రోజు, 12 మందికి రెండు రోజులు, మరో 14 మందికి మూడు రోజుల చొప్పున జైలు శిక్షలు విధించినట్లు గజ్వేల్ ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ (Gajwel Traffic CI Satyanarayana)వెల్లడించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారులతో పాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ద్వారా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపకుండా రోడ్డు భద్రతకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మద్యం తాగి వాహనం నడపవద్దని.. మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని సూచించారు.