ఎంబీఏ పూర్తిచేసి స్వదేశానికి వచ్చిన విద్యార్థి
బోథ్ అక్టోబర్ 14 ( విజయక్రాంతి): మండలంలోని కౌటాబి గ్రామానికి(Kautabi village) చెందిన సర్పంచ్ ఓరుగంటి స్వామి(Sarpanch Oruganti Swamy) కుమారుడు శివకుమార్ కెనడా(Canada) దేశంలో ఎంబీఏ పూర్తి చేసి స్వదేశానికి వచ్చిన సందర్భంగా మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్లు సర్పంచ్లు సన్మానించారు.
న్యాయవాది పంద్రం శంకర్ సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు బండారి శ్రీధర్ రెడ్డి పిప్పలదరి గ్రామ సర్పంచ్ మిశ్రమ కిస్టు లతోపాటు బిఆర్ఎస్ బోధి పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్ ఉపసర్పంచ్ బండారి స్వామిలు విద్యార్థిని శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరింత ఉన్నతంగా ఎదిగి గ్రామం పేరుతో పాటు తల్లిదండ్రుల పేర్లు నిలపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌటాభి గ్రామ సర్పంచ్ ఓరుగంట స్వామి పాల్గొన్నారు.