బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

14-10-2026 | 08:13pm

ప్రకృతి ప్రేమకు, ఆడపడుచుల ఆత్మీయతకు బతుకమ్మ వేడుకలు నిదర్శనం: మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని

హుజురాబాద్, అక్టోబర్ 14: (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సంస్కృతి(Culture of Telangana State), సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

బుధవారం హుజురాబాద్ పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలతో పాల్గొని ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సుహాసిని మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల జీవన విధానాన్ని, ప్రకృతితో ముడిపడిన మన సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఈ పండుగ వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలందరూ సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని, పండుగ ద్వారా ఐకమత్యం, సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, మెప్మా టీఎంసీ మల్లేశ్వరి, సీఆర్పీలు రమాదేవి, స్వరూప, టీఎల్ఎఫ్ ఆర్పీ అనూష, ఓబీలు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు