కనకదుర్గమ్మ ను దర్శించుకున్న రాష్ట్రపతి
విజయవాడ: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడలోని ప్రసిద్ధ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించి, కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకోవడంతో ఈ పర్యటనకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంద్రకీలాద్రికి చేరుకున్నరాష్ట్రపతికి హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ స్వాగతం పలికారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు నమాస్కారం చేస్తూ రాష్ట్రపతి ముర్ము ముందుకు సాగారు.
అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు లోకేష్ , అనిత, కొల్లు రవీంద్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకున్నారు.