గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తాం

04-11-2026 | 11:47pm

ఎమ్మెల్యే పాల్వాయి, ఎమ్మెల్సీ దండే విఠల్ 

బెజ్జూర్ నవంబర్ 4 (విజయక్రాంతి): గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విటల్ అన్నారు. బెజ్జూర్ మండలంలోని సోమీని గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్సీ దండే విట్టల్(MLC Dande Vittal) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండలంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు సోమిని గ్రామాల్లోని భోగ మౌనిక జీవన్ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.

నియోజకవర్గానికి అదనంగా 1000 ఇండ్లు మంజూరు కోసం కృషి చేస్తామని తెలిపారు. 124 మంది ఇల్లు మంజూరైనప్పటికీ ప్రారంభించుకొని వారి వెరిఫికేషన్ చేసి నిర్మాణం చేపట్టకపోతే వాటిని రిజెక్ట్ చేసి వేరే వారికి అందించేలా కృషి చేయాలని హౌసింగ్ ఏఈ  సాయికుమార్ కు అధికారులు ఆదేశించారు. రెండు బ్రిడ్జిలు, రోడ్డు అటవీ శాఖ అనుమతులు తీసుకువచ్చి త్వరలోనే పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. పెంచికల్పేట్, గూడెం రోడ్డు పనులు కూడా జపాన్ టెక్నాలజీ తో శీలపల్లిలో పనులు నడుస్తున్నాయని అదే మాదిరిగా పనులు చేసేలా చూస్తామని తెలిపారు.

ఇందిరమ్మ ఇల్లు వేగవంతంగా పూర్తి చేసేలా లబ్ధిదారులు చూడాలని తెలిపారు. తలాయికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు తెలపడంతో  డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాలలో సిసి రోడ్లు, డ్రైనేజీలు మంజూరు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, హౌసింగ్ ఏఈ సాయి కుమార్, జెడ్పిటిసి పంద్రం పుష్పలత, సర్పంచులు సరిత, సోయం చిన్నయ్య, శ్రీహరి, చిరంజీవి, కొడుకు శంకర్, నాయకులు జగ్గ గౌడ్, రాచకొండ శ్రీ వర్ధన్, వశీ ఉల్లా ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు