ఆదివాసీల గూడేలలో ఆలరించిన ఐఏఎస్ అధికారుల గుస్సాడి నృత్యాలు
ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను మరువలేం...
ఊరంతా పండుగ.. వాతావరణం...
బోథ్. నవంబర్ 4 (విజయక్రాంతి): నేరడిగొండ మండలం(Neredigonda Mandal)లోని కుమారి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గాజిలి గ్రామంలో బుధవారం ట్రైన్ ఐఏఎస్ ,ఐఆర్ఎస్, ఐపీఎస్, అధికారుల బృందం గ్రామంలో ఆలరించింది. 5 రోజులపాటు వివిధ గ్రామాలలో పర్యటించిన అధికారులు చివరి రోజున మారుమూలన ఉన్న గాజుల గ్రామానికి వెళ్లారు.
గ్రామానికి వెళ్ళగానే ఊరంతా సాంప్రదాయ దప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. గ్రామ పటేల్ ఇంటి వరకు అధికారులను తీసుకువెళ్లి వారిని పటేల్ ఇంటి వద్ద కూర్చుండబెట్టారు. కొద్దిసేపు గుస్సాడీల ముత్యాలను చూసిన అధికారుల బృందం వారి సంస్కృతి సాంప్రదాయాలను చూసి ముచ్చటపడి పోయారు. దశాబ్దాలకాలంగా సంస్కృతి సాంప్రదాయాలను మరవకుండా ఉన్న ఆదివాసీల ఐక్యతను అభినందించారు.
అనంతరం అధికారులు నెత్తిన నెమలి ఈకల టోపీలు పెట్టుకుని చేతిలో దుడ్డు కర్ర పట్టుకుని ఆదివాసీల సాంప్రదాయ డప్పుల సప్పుల మధ్య వ్యక్తం చేశారు. అధికారులు నృత్యాలు చేస్తున్నంత సేపు గ్రామస్తులంతా వారి వెంట కలిసి నృత్యం చేయడం జరిగింది. గ్రామస్తులతో కలిసి ఆడిన అధికారులు తాము ఈ సంఘటనను ఎన్నడూ మరువలేమని మీ అభిమానం మమ్ములను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. అధికారుల వెంట గ్రామ సర్పంచ్ అగ్గిమల్ల గోదావరి లక్ష్మన్న, ఉప సర్పంచ్ ఆడిపు రవి సహకార సంఘం అధ్యక్షులు మందుల రమేష్ మల్టీపర్పస్ వర్కర్లు పాల్గొన్నారు. తమ గ్రామానికి వచ్చిన అధికారుల బృందాన్ని సర్పంచ్ ఉప సర్పంచ్ తో పాటు సహకార సంఘం చైర్మన్ లు శాలువాలతో సన్మానించారు.