రహదారికి అడ్డుగా ఫ్లెక్సీలు.. తరచూ ప్రమాదాలు

28-11-2026 | 04:52pm

బోథ్, నవంబర్ 28 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రం మీదుగా వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి (Interstate Highway) పక్కన ఉన్న కొమరం భీమ్ చౌక్ వద్ద విద్యుత్ స్తంభాలకు ఇరువైపులా నాయకులు భారీ ఫ్లెక్సీలు (Flexi Banners) ఏర్పాటు చేశారు. అయితే నాయకుల అభిమాన ప్రదర్శన వాహనదారులకు ప్రమాదకరంగా మారుతోంది. రహదారిపై ప్రయాణించే వారికి ఫ్లెక్సీల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరచూ ప్రమాదాలు (Road Accidents) జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా వాటిని తొలగించడంలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ విషయంపై గ్రామ కార్యదర్శి వెంకటరమణను అడగగా త్వరలోనే ఫ్లెక్సీలను తొలగిస్తామని తెలిపారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే నాయకులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు