నేర్చుకున్న వృత్తితో ఉపాధి పొందాలి

28-10-2026 | 03:51pm

బోథ్. అక్టోబర్ 28 ( విజయక్రాంతి) : ఉచితంగా వృత్తి విద్య(Vocational Education) ద్వారా వేసుకున్న శిక్షణ ను ఉపాధి పొందేందుకు. వినియోగించుకోవాలని వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు అశోక్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలో ని వెల్ఫేర్ సొసైటీ(Welfare Society) ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సాయి సేవ సమితి సహకారంతో శ్రీ రామానంద తీర్థ తరఫున శిక్షణ పొందిన వారు భవిష్యత్తులో ఆర్థికంగాఎదగాలన్నారు.

రెండు మూడు నాలుగు వ్యాసాలు శిక్షణ పొందిన 100 మంది తమ కుటుంబాలకు బాసటగా నిలవాలన్నారు. గ్రామ సర్పంచ్ కురుమేఅన్నపూర్ణ మహేందర్, ఉప సర్పంచ్ ఉండ్రు విజయలక్ష్మి రాజారెడ్డి ల చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందించారు. మహిళలు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

హైదరాబాదులోని స్వామి నంద తీర్థ వారు 17 రకాల ఉచిత శిక్షణ(Free Training) ఇస్తున్నారని శిక్షణ పూర్తి అయిన తర్వాత ఉద్యోగం సైతం లభించే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలను మహిళలు తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. మాసం కలిపితే సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ఆదర్శంగా ఉందన్నారు. కార్యక్రమంలో కుట్టు మిషన్ శిక్షకురాలు శ్రీజ సభ్యులు సామాన్ పల్లి అరుణ్ రాజ్ సిరి వేరు బన్నీ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు