రూ. 35 కోట్లతో నాగోబా ఆలయ అభివృద్ధి పనులు

10-11-2026 | 08:18pm

* జాతర ప్రారంభంలోగా  ముత్నూర్ నుండి కేస్లాపూర్ వరకు రోడ్డు పనులు పూర్తి చేస్తాం...

*  గిరిజన సంక్షేమ శాఖ  ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్  బాలు నాయక్..

ఉట్నూర్, నవంబర్ 10  ( విజయక్రాంతి ): అదిలాబాద్ జిల్లా(Adilabad District) ఇంద్రవెల్లి మండలంలోని ఆదివాసుల ఆరాధ్య దేవుడు నాగోబా(Nagoba) సన్నిధిలో 20 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను(development works) చేపడుతున్నామని గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare Department)  ఇంజనీరింగ్ విభాగం  చీఫ్ ఇంజనీర్  బాలు నాయక్ అన్నారు. మంగళవారం సాయంకాలం నాగోబా దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగోబా సన్నిధిలో కోటి రూపాయలతో  నిర్మించే గెస్ట్ హౌస్ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.

అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్,జిల్లా కలెక్టర్  రాజర్శి షా  ప్రతిపాదించిన పనులకు ప్రభుత్వం మంజూరు చేసిందని, ఆ పనులకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. ముత్నూర్ నుండి కేస్లాపూర్ వరకు  15 కోట్లతో  రెండు వరసల రహదారి పనులు నాగోబా జాతర ప్రారంభంలోగా  పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని  ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

ఈ నెలాఖరులోగా  రోడ్డుపనుల  టెండర్లు పూర్తి అవుతాయని  చీఫ్ ఇంజనీర్ అన్నారు. అనంతరం గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమం ఉన్నత పాఠశాలలో  40 లక్షలతో నిర్మించే  సిబ్బంది నివాస గృహాల పనులను పరిశీలించారు. ఆయన వెంట వరంగల్ సూపర్డెంట్ ఇంజనీర్  ఫణి కుమారి, ఐటిడిఏ ఇంజనీరింగ్ విభాగం  ఈ ఈ జాదవ్ తానాజీ, డిప్యూటీ ఈ ఈ  నవీన్, ఏ ఈ ఈ ఉజ్వల్, సర్పంచ్ మెస్రం తుకారం, కాంట్రాక్టర్ అజార్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు